Wed Feb 25 2026 13:19:08 GMT+0530 (India Standard Time)
మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

అమెరికా అధ్యక్షుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత్-పాక్ యుద్ధం ఆపకపోతే పాక్ ప్రధాని చనిపోయేవారని సంచలన కామెంట్స్ చేశారు. భారత్ - పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో తాను ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలతో చర్చించానని అన్నారు.
యుద్ధం ఆపకుంటే...
తాను యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చనిపోయేవారని, ఆయనను తానే కాపాడానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. 35 మిలియన్ల పాక్ ప్రజలు చనిపోయేవారన్న ట్రంప్ యుద్ధాన్ని ఆపి తాను శాంతిని నెలకొల్పానని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాలు ప్రశాంతంగా ఉన్నాయంటే అది తన కృషి మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Next Story

