Sat Apr 19 2025 08:14:25 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : బ్యాంకాక్, మయన్మార్ లో భూకంపం బీభత్సం.. మృతుల సంఖ్య వందల్లోనే?
బ్యాంకాంక్, మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపంతో ప్రాణ నష్టం అత్యధికంగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపంతో ప్రాణ నష్టం అత్యధికంగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ లో భూకంప తీవత్ర రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదు కావడంతో సన్నగా, పొడుగ్గా ఉన్న భవనాలు కుప్పకూలిన వీడియోలుసోషల్ మీడియాలో వైరల్ గామారాయి. ఒకటి కాదు.. రెండు కాదు మూడు సార్లు వెంట వెంటనే భూకంపం సంభవించడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. భవనాలు, ఫ్లైఓవర్ లు కుప్పకూలిపోయాయి.
ఆసుపత్రి భవనం కూలి...
ఇక మెట్రో స్టేషన్ లో అయితే ఒక రైలు ఊగిపోయింది. ప్రయాణికులు ఒకరిని ఒకరు పట్టుకుని ప్రాణాలు ఉగ్గపట్టుకుని గడిపారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ భూకంపం సంభవిండంతో ఆఫీసుల్లో ఉన్న వారు, షాపింగ్ చేస్తున్న వారు, ప్రయాణాల్లో ఉన్న వారుఇలా ఒకరేమిటి ఎవరికి వారే మైదాన ప్రాంతాన్ని చూసుకుని బయటకు పరుగులు తీశారు. వాహనాలను రోడ్డు మీద వదిలేసి బయటకు వచ్చిప్రాణాలను దక్కించుకున్న వారు అనేక మంది ఉన్నారని తెలిసింది. ఇక మయన్మార్ రాజధాని నేపిడాలోని వెయ్యి ఆసుపత్రి కుప్ప కూలిపోయింది. ఈ ఆసుపత్రి భవనం కింద అనేక మంది మృతులు ఉంటారని తెలిసింది. ఇక్కడే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. దాదాపు వందల సంఖ్యలో ఈ భవనం కింద ఉండే అవకాశముందని తెలిసింది. సహాయక చర్యలు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు అందేలా లేవు. కొత్త ఆసుపత్రి కావడంతో ఇకంా పేరు పెట్టని ఈ ఆసుపత్రి భవనం శిధిలాల కింద ఎంత మంది ఉంటారన్నది కూడా అంచనాకు అంతడం లేదు.
బ్యాకాంగ్ లోనూ...
ఇక బ్యాంకాంగ్ లో భూకంపం వల్ల కూడా భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఇక్కడ ఒక ముప్ఫయి అంతస్థుల భవనం కూలిపోవడంతో ఎక్కువ మంది ఈ భవనం కింద ఉండి ఉంటారని భావించి చర్యలు ప్రారంభించారు. శిధిలాల తొలగింపు ప్రారంభమయింది. ఇక్కడ 7.3 తీవ్రత రిక్టర్ స్కేల్ పై నమోదయింది. ఈ భవనం కింద 43 మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఇద్దరు మాత్రమే మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంఖ్య ఎక్కడకు వెళుతుందో చెప్పలేమని చెబుతున్నారు. దీతో దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించారు. మెట్రో రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఎటు చూసినా మట్టి దిబ్బలు. శిధిలాలే. తమ వారి కోసం వెదుకుతూ అనేక మంది రోదిస్తుండటం కలచివేస్తుంది.
Next Story