Fri Feb 14 2025 17:32:57 GMT+0000 (Coordinated Universal Time)
America : ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ ఆదేశాలు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన ఆదేశాలాను నిలిపేసింది

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన ఆదేశాలాను నిలిపేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది అమెరికాలో సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక ఆదేశాలను వెల్లడించింది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయడం పై తాత్కాలికంగా స్టే విధించారు.
కోర్టు ఆదేశాలు...
ట్రంప్ ఆదేశాలు చెల్లవని సియాటల్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 78 ఫైళ్లపై సంతకాలు చేశారు.అందులో ఇది ప్రధానమైనది. వలసవాదులు అక్కడకు వచ్చిస్థిరపడటానికి, అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందడానికి ప్రధాన కారణమైన విషయంలో ట్రంప్ తొందరపాటు నిర్ణయాన్ని అందరూ తప్పు పట్టారు. కేవలం అమెరికా ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలు మాత్రంగానే చూశారు. అయితే దీనిప వాషింగ్టన్, ఇల్లినాయిస్, ఓరెగాస్, అరిజోనా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధలనకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని తమ వాదనలను వినిపించాయి.
తాత్కాలికమే అయినా...
అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. ఇక పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే ఇరవై రెండురాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి. ట్రంప్ పై అంతర్జాతీయంగా కూడా పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆదేశాలు నియంతృత్వానికి నిదర్శనమని అనేక మంది పేర్కొన్నారు. అందులో భాగంగానే కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన ఆలోచనలను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. ఇది ట్రంప్ కు ఎదురుదెబ్బేనని చెప్పాలి.
Next Story