Sat Mar 07 2026 23:02:36 GMT+0530 (India Standard Time)
London : క్షమించండి.. ఓటమికి పూర్తిగా నాదే బాధ్యత
బ్రిటన్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి పాలయింది. ప్రధాని రిషి సునాక్ కూడా పార్టీ ఓటమిని అంగీకరించారు.

బ్రిటన్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి పాలయింది. ప్రధాని రిషి సునాక్ కూడా పార్టీ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన ప్రకటించారు. బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
ప్రధానిగా కీర్ స్టార్మర్...
రిషి సునాక్ తన మద్దతు దారులతో మాట్లాడుతూ అధకారం శాంతియుతంగా చేతులు మారుతుదని, దేశ భవిష్యత్, స్థిరత్వంపై అందరికీ నమ్మకం కలిగిస్తుందని తెలిపారు. పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని, తనను క్షమించాలని రిషి సునాక్ మద్దతు దారులను కోరారు. రిషి సునాక్ మాత్రం రిచ్ మండ్స్ స్థానం నుంచి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. లేబర్ పార్టీ మెజారిటీ స్థానాలను అధిగమించడంతో కన్సర్వేటివ్ పార్టీ తన ఓటమిని అంగీకరించింది.
Next Story

