Fri Dec 05 2025 19:49:12 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : హోటల్ కు నిప్పు... 24 మంది సజీవ దహనం
బంగ్లాదేశ్ లో ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనికపాలనలోకి వచ్చినా విధ్వంసం ఆగడం లేదు

బంగ్లాదేశ్ లో ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనికపాలనలోకి వచ్చినా విధ్వంసం ఆగడం లేదు. తాజాగా ఒక హోటల్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారని తెలిసింది. జషోర్ జిల్లాలోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్ కు చెందింది.
ఇప్పటి వరకూ...
ఈ ఘటనలో హోటల్ లో ఉన్న వారిలో 24 మంది సజీవదహనమయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 440 కి చేరింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా హింస కొనసాగుతుంది. సైన్యం ఆందోళనకారులను అదుపు చేయలేక చేతులెత్తేస్తుంది.
Next Story

