Fri Dec 05 2025 09:57:41 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో దారుణ హత్య... భారతీయుడిన చంపేసి?
అమెరికాలోని డల్లాస్ నగరంలో ఒక హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు.

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డల్లాస్ నగరంలో ఒక హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో నాగమల్లయ్య చనిపోయాడు. మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం వాగ్వాదంగా మారింది.
తన వద్ద పనిచేస్తున్న...
మార్టినెజ్ హోటల్ లో గదిని శుభ్రం చేస్తుండగా విరిగిన వాషింగ్ మిషన్ ను వాడవద్దని తెలిపాడు. మరో మహిళ ఉద్యోగితో చెప్పించడంతో నాగమల్లయ్యను కత్తితో మార్టినెజ్ పొడిచి పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా అడ్డుకుని కసితీరా పొడిచాడు. హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు దాడిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం వెతుకుతున్నారు.
Next Story

