Fri Dec 05 2025 12:29:31 GMT+0000 (Coordinated Universal Time)
కమలాహారిస్ కార్యాలయంపై కాల్పులు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి కాల్పులు జరిగాయి

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకులతో దాడి చేశారు. దీంతో అమెరికాలో మరొకసారి కాల్పుల కలకలం రేగింది. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అక్కడి వారు తెలిపారు. అయితే కాల్పులు జరిపన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ముప్ప తప్పిందని చెబుతున్నారు.
కిటికీ వద్ద నుంచి...
పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విచారణ ప్రారంభించారు. ఆరిజోనాలోని డెమొక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచరా కార్యాలయంపై ఈ దాడి జరగింది. ఇటీవలే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. వరస కాల్పులు ఎన్నికల వేళ అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

