Tue Mar 17 2026 19:19:27 GMT+0530 (India Standard Time)
ఆగంతకుల ఫైరింగ్.. 14 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో 14 మంది మరణించారు.

దక్షిణాఫ్రికాలో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో 14 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్ లోని సెవెటో టౌన్షిప్ లో ఈ ఘోరం జరిగింది. టౌన్ షిప్ లో ఉన్న బార్ లోకి ప్రవేశించిన కొందరు దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా ముగ్గురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
మినీ బస్సులో వచ్చి...
దుండగుల లక్ష్యం తెలియదని, కాల్పుల శబ్దం విన్పించిన వెంటనే భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రాధమిక సమాచారం మేరకు కొందరు వ్యక్తులు చేసిన దాడిగా తాము చూస్తున్నామని పోలీస్ కమిషనర్ ఇలియాస్ మవేలా తెలిపారు. నిందితులంతా మినీ బస్సులో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు.
Next Story

