Turkey : టక్కుటమార టర్కీకి భారత్ దెబ్బ మామూలుగా లేదుగా?
బాయ్ కాట్ టర్కీ నినాదం భారత్ లో ఊపందుకుంది.

చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నట్లు తయారైంది టర్కీ పరిస్థితి. బాయ్ కాట్ టర్కీ నినాదం భారత్ లో ఊపందుకుంది. టర్కీ లోని పలు ప్రాంతాలకు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ టిక్కెట్లను కూడా కాన్సిల్ చేసుకున్నారంటే ఏ రేుంజ్ లో ఆ దేశానికి భారత్ నుంచి షాక్ తగిలిందో చెప్పకనే తెలుస్తుంది. టర్కీ నుంచి ఏ వస్తువులను కూడా దిగుమతులు చేసుకోకూడదని వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడంతో ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లయింది. టర్కీ చేజేజుతులా చేసుకున్న పనికి అనుభవించాల్సి వస్తుంది. భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో పాక్ కు టర్కీ ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు డ్రోన్లు, క్షిపణులను అందించడాన్ని భారతీయులు ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. బాయ్ కాట్ టర్కీ నినాదం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. యాపిల్స్ దిగుమతిని తొలుత నిషేధించిన వ్యాపారులు ఇంకా అనేక రకాలుగా ఆ దేశ వస్తువులను బహిష్కరిస్తున్నారు. టర్కీ దేశానికి వెళ్లేందుకు టిక్కెట్లను కూడా రద్దు చేసుకున్నారు.

