Fri Dec 05 2025 21:16:26 GMT+0000 (Coordinated Universal Time)
ఇకపై అక్కడ క్వారంటైన్ సమయం 10 రోజులే.. నెగిటివ్ సర్టిఫికేట్ అక్కర్లేదు !
ఇప్పటి వరకూ అక్కడ క్వారంటైన్ సమయం 14 రోజులుగా ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని 10 రోజులకు కుదిస్తూ నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే.. గడిచిన రెండు, మూడు వారాలతో పోలిస్తే.. ఇప్పుడు కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని దేశాలు క్రమంగా ఆంక్షలను సడలిస్తున్నాయి. పాజిటివ్ రేటును బట్టి.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తివేయడం, క్వారంటైన్ సమయాన్ని తగ్గిచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ క్వారంటైన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడున్న ఇన్ఫెక్షన్ రేటును పరిగణలోకి తీసుకున్న బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్.. కొన్ని సడలింపులను ప్రకటించింది.
ఇప్పటి వరకూ అక్కడ క్వారంటైన్ సమయం 14 రోజులుగా ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని 10 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై డీజీహెచ్ఎస్ ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ నజ్ముల్ ఇస్లాం మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చినవారు 10 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలని స్పష్టం చేశారు. 10 రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపించకపోతే.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు.. తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరాలంటే ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌లో నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండగా.. ఆ ఆదేశాలను కూడా నిలిపిస్తున్నట్టు వెల్లడించారు.
Next Story

