Fri Dec 05 2025 22:46:54 GMT+0000 (Coordinated Universal Time)
నెమలిని ఎత్తుకెళ్లిన ఇమ్రాన్ అనుచరులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

పాకిస్థాన్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడంతోపాటు పలు విధ్వంసకర సంఘటనలకు పాల్పడ్డారు.
పాక్ లో ఉద్రిక్తత...
ఈ నేపథ్యంలోనే అనేక హింసాత్మక ఘటనలను జరిగే అవకాశముందన్న హెచ్చరికలతో ఆర్మీ అప్రమత్తమయింది. అనేక చోట్ల హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఇ్రమాన్ అనుచరులు ఓ కమాండర్ ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు నెమలిని కూడా ఎత్తుకెళ్లడం వైరల్ గా మారింది. ప్రజల డబ్బుతో కొనుగోలు చేసినదాన్ని తీసుకెళుతున్నానని నెమలిని ఎత్తుకెళుతున్న వ్యక్తి చెప్పడం వీడియోలో చెప్పడంతో అది నెట్టింట వైరల్ గా మారింది.
Next Story

