Thu Jan 29 2026 08:50:15 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : జపాన్ లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు
జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రత కనిపించింది

జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రతతో ఈశాన్య ప్రాంతం కంపనం కనిపించింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేసినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. నష్టం, గాయాల వివరాలు స్పష్టంగా లేవని అధికారులు చెప్పారు.
వారంలో రెండో భారీ కంపనం
ఈ ఘటనకు మూడు రోజుల ముందే ఉత్తర ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చింది. ఆ కంపనాల వల్ల పసిఫిక్ తీర ప్రాంతాల్లో చిన్న సునామీ వచ్చినట్టు అధికారులు చెప్పారు. కాటుక గాయాలతో పాటు స్వల్ప నష్టం చోటుచేసుకుంది. గత సోమవారం 34 మందికి గాయాలు కాగా సోమవారం అఒమోరి తీరానికి సమీపంలో నమోదైన ఆ భూకంపంలో కనీసం 34 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Next Story

