Sat Jan 31 2026 15:20:06 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో భూకంపం తీవ్రత ఎంతంటే?
చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతగా నమోదయింది

చైనాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం సంభవించిన భూకంప తీవ్రతకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.59 గంటలకు భూకంపం సంభవించింది. రిక్కర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5 గా నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు.
భూకంప తీవ్రతకు...
నిన్న టర్కీలో కూడా భూకంపం సంభవించింది. అయితే నేటి ఉదయం చైనాలో సంభవించిన భూకంపానికి ప్రజలు ఆందోళన చెందారు. ఎంత మేరకు ప్రాణ,ఆస్తి నష్టం సంభవించిందన్నది కూడా తెలియరాలేదు. అయితే ప్రాణనష్టం లేదని, ఆస్తి నష్టం తక్కువగానే ఉందని అందుతున్న ప్రాధమిక సమాచారం మేరకు తెలుస్తుంది.
Next Story

