Fri Dec 05 2025 09:03:48 GMT+0000 (Coordinated Universal Time)
మోదీకి ఫోన్ చేయడంతో అదనపు సుంకాలు తగ్గుతాయా? త్వరలో గుడ్ న్యూస్ రానుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో మాట్లాడతానను అని ట్రంప్ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడు మోదీ పుట్టిన రోజు సందర్భంగా విష్ చేయడానికి ట్రంప్ ఫోన్ చేశారు. ఇంత కాలం ఫోన్లు ఎత్తని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి మాత్రం మోదీ ఫోన్ లిఫ్ట్ చేసి ట్రంప్ ఇచ్చిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఈ ఘటనతో ట్రంప్ భారత్ పై విధించిన అదనపు సుంకాలు తగ్గిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
వాణిజ్య చర్చలు ప్రారంభమయినా...
ఇప్పటికే భారత్ - అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమమయ్యాయి. రెండు దేశాలకు చెందిన అత్యున్నత అధికారులు అదనపు సుంకాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఏ విషయం వెల్లడి కాలేదు. కానీ అమెరికా మాత్రం భారత్ పై విధించిన అదనపు సుంకాలు తిరిగి మామూలు స్థితికి తేవాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయాలన్న షరతును మాత్రం యధాతధంగా కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడవుతుంది.
ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటేనే...
అయితే డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ కలసి కూర్చుని చర్చించుకుంటేనే అదనపు సుంకాల విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశముంటుందని అంటున్నారు. నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికాకు ఉన్న అభ్యంతరాలమేమిటో చెప్పడం బహిరంగంగా చెప్పడం లేదు. కానీ ఉక్రెయిన్ పై దాడులు ఆపడానికేనని మాత్రం బయటకు ఫిల్లర్లు వదులుతుంది. భారత్ మాత్రం చమురు కొనుగోలుపై వెనక్కు తగ్గుతుందని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద ఈరోజు ఇద్దరు దేశాధినేతల మధ్య పరస్పర మాటలు అదనపు సుంకాలు దిగివస్తాయన్న ఆశలు మాత్రం భారతీయుల్లో చిగురిస్తున్నాయి.
Next Story

