Sat Mar 28 2026 14:44:20 GMT+0530 (India Standard Time)
సుప్రీం లీడర్ ఇక లేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం లీడర్ ఇక లేరని అన్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చనిపోయారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో ఉందని పేర్కొన్నార.
ఇరాన్ ప్రజలు మార్పును...
ఇరాన్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో చర్చలు జరుపుతుందని పదే పదే ప్రకటిస్తున్న ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాత్రం చర్చలు ఏవీ తమ మధ్య జరగడం లేదని చెబుతోంది. మరి ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
Next Story

