Fri Dec 05 2025 11:14:20 GMT+0000 (Coordinated Universal Time)
H1 B Visa : తీపికబురు అందించిన వైట్ హౌస్.. H1B వీసాలపై క్లారిటీ ఇదే
భారతీయులకు అమెరికా అధ్యక్షుడు H1B వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీపికబురు అందించారు

భారతీయులకు అమెరికా అధ్యక్షుడు H1B వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీపికబురు అందించారు. H1B వీసాల విషయంలో ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్ డాలర్ల కలను సాకారం చేసుకునేందుకు వెళ్లిన వారికి షాక్ ఇచ్చారు. H1B వీసాలలు కలిగిన వారిలో 70 శాతం మంది భారతీయులే ఎక్కువ ఉన్నారు. దీంతో ట్రంప్ తీసుకు వచ్చిన భారతీయుల్లో కంగారు పెట్టింది. అయితే శ్వేతసౌధం నుంచి మాత్రం సానుకూల ప్రకటన వెలువడింది. ఈ నిబంధనలు కొత్తగా H1B వీసాల దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని తెలిపింది.
ఒకేసారి చెల్లిస్తే...
వారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలి ఉంటుందని, సెప్టంబరు 21వ తేదీ లోపు పిటీషన్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రం ఒకేసారి ఈ రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ రుసుము ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదని, వన్ టైమ్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఇప్పటికే H1B వీసాలున్న వారితో పాటు, అమెరికా బయట ఉన్న వారు కూడా తిరిగి అమెరికా ప్రవేశించాలంటే లక్ష రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. H1B వీసాలు కలిగిన వారు వేరే దేశం వెళ్లి తిరిగి అమెరికా లోనికి ప్రవేశించ వచ్చని పేర్కొన్నారు. ఇది భారతీయులకు ఊరటకల్గించే విషయం.
Next Story

