Sun Apr 12 2026 14:41:56 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఈ హైదరాబాద్ జపం ఏంది బాబూ..అమరావతికి అంత సీన్ ఉందా?
అమరావతిని చంద్రబాబు పదే పదే హైదరాబాద్ తో పోలుస్తున్నారు

అమరావతిని చంద్రబాబు పదే పదే హైదరాబాద్ తో పోలుస్తున్నారు. హైదరాబాద్ కు అమరావతికి ముడి పెట్టకూడదు. హైదరాబాద్ కు ఆదాయం తెచ్చి పెట్టింది అక్కడ అసెంబ్లీ కాదు.. సచివాలయం కాదు.. మంత్రుల నివాసాలు కాదు.. హైకోర్టు కాదు.. కేవలం ఐటీ కంపెనీలు.. పరిశ్రమలు.. హైదరాబాద్ కు వెళితే ఖచ్చితంగా ఏదో రకమైన ఉపాధి దొరుకుతుంది. ఎటు చూసినా పరిశ్రమలు.. సినీ పరిశ్రమ నుంచి ఫార్మా.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉంటాయి. అవే హైదరాబాద్ కు అంతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.మరొక వైపు టూరిజం సిటీగా కూడా హైదరాబాద్ ఇన్ కమ్ తెచ్చిపెడుతుంది.
జనాభా చూసుకున్నా...
హైదరాబాద్ లో ప్రజలు రెండు కోట్లు దాటేశారు. అమరావతిలో రెండు లక్షల మంది లేరు. పైగా ఎలాంటి పరిశ్రమలు లేవు. ఏదైనా పరిశ్రమలు ఉంటే తప్ప అక్కడ హోటల్ రంగమైనా.. సినీ రంగమైనా.. మరొక పరిశ్రమ అయినా వచ్చి వాలుతుంది. జనం లేని చోటకు వచ్చి వారు ఏం చేస్తారు. అక్కడ డబ్బులు పెట్టి ఎన్నేళ్లలో తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటామన్న అంచనాలు కూడా వారికి అమరావతిని చూస్తే ఉండవు. అందుకే వెనక్కు తగ్గుతారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప అక్కడ మరో పరిశ్రమకు ఇప్పట్లో అవకాశం లేదు. అమరావతిలోనూ వేగంగా పరిశ్రమలు వస్తే తప్ప నిదానంగా డెవలెప్ అయ్యే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ స్పెషాలిటీ...
మరొకవైపు హైదరాబాద్ కు, అమరావతికి వాతావరణలో ఎంతో తేడా ఉంది. హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కావాల్సినంత ఎంజాయ్ మెంట్ లభిస్తుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడటంతో పాటు వచ్చే పోయే వారితో కళకళలాడుతుంటుంది. రోజుకు హైదరాబాద్ కు ఐదు లక్షల మంది వివిధ పనుల కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తారని అంచనా. అదే అమరావతికి అంత సీన్ ఇప్పుడుందా? భవిష్యత్ లో ఎప్పుడొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పదే .. పదే హైదరాబాద్ తో పోలిక చేయకుండా.. నిదానంగా అమరావతిని అభివృద్ధి చేసుకుని వెళితే చంద్రబాబుకు మంచిది. అంతే తప్ప ఆకాశానికి నిచ్చెనలు వేస్తే అభాసుపాలయ్యేది ఎవరో కాదు.. తెలిసిందా సామీ.
Next Story

