Fri Dec 05 2025 08:07:29 GMT+0000 (Coordinated Universal Time)
Amercia : అమెరికాలో భారీ పేలుడు - 19 మంది మృతి
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు.

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో జరిగిన భారీ పేలుడులో ఈ ఘోర విపత్తు సంభవించింది. ఒక మిలిటరీ యుద్ధసామగ్రికి చెందిన ప్లాంట్ లో భారీ పేలుడు జరిగింది. అయితే ఘటన అనంతరం పందొమ్మిది మంది గల్లంతయ్యారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కార్లు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రత అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
కొన్ని కిలోమీటర్ల వరకూ...
మంటలు వ్యాపించి అనేక కార్లు దహనమయ్యాయి. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకూ వినిపించడంతో పాటు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్లు కూడా షేక్ అయ్యాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే పేలుడు ఎందుకు జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్విస్టిగేషన్ అధికారులు అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించారు
Next Story

