Fri Mar 20 2026 20:12:38 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం... 23 మంది మృతి
బంగ్లాదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. బంగ్లాదేశ్ కరటోయా నదిలో పడవ బోల్తా పడింది

బంగ్లాదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది వరకూ మరణించారు. బంగ్లాదేశ్ కరటోయా నదిలో పడవ బోల్తా పడింది. పడవ ప్రమాద సమయంలో వంద మంది వరకూ ఉన్నారని సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తర బంగ్లాదేశ్ లోని పంచాఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మృతుల సంఖ్య
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొందరి మృతదేహాలను సహాయ బృందాలను ఇప్పటికే బయటకు తీశారు. పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లనే వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

