Sat Mar 07 2026 18:15:53 GMT+0530 (India Standard Time)
వీధుల్లోకి వచ్చి కాల్పులు.. 11 మంది మృతి
ఐరోపాలోని మాంటినీగ్రో దేశంలో ఘోరం జరిగింది. దుండగుడు కాల్పులకు 11 మంది మరణించారు

ఐరోపాలోని మాంటినీగ్రో దేశంలో ఘోరం జరిగింది. దుండగుడు కాల్పులకు 11 మంది మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఆగంతకుడు కూడా మరణించాడు. తన కుటుంబ సభ్యులతో తగాదా పడిన నిందితుడు తుపాకీతో వీధుల్లోకి వచ్చి జనంపైకి కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా దుండగుడు కాల్పులు జరపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తనకు కన్పించిన వారందరిపై కాల్పులు జరపడంతో 11 మంది మృత్యువాత పడ్డారు.
కుటుంబంతో తగాదా పడి....
అయితే పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు మరణించారు. మాంటినెగ్రో రాజధాని గొడొగ్రికాకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటెంజీ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

