Sun Mar 08 2026 06:17:40 GMT+0530 (India Standard Time)
ఘోర విమాన ప్రమాదం... మృతుల సంఖ్య?
కజికస్థాన్ లో ఘోర విమానప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణించారు.

కజికస్థాన్ లో ఘోర విమానప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణించారు. ఆక్టౌ సమీపంలో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 70 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఈ విమానం రిపబ్లిక్ చెచైన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఎమెర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతున్న సమయంలో...
అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానం దారి మళ్లించారు. అయితే ఎమెర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాలిలోనే అనకసార్లు విమానం పల్టీ కొట్టి కిందకు పడిపోయిందని అధికారుల చెబుతున్నారు. ఎయిర్ పోర్టుపైనే ఈ ఘటన జరగడంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కొందరు ప్రయాణికులను రక్షించినట్లు సమాచారం. మరికొందరు మాత్రంమరణించారని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

