Fri Mar 20 2026 05:26:01 GMT+0530 (India Standard Time)
అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవదహనం
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. కరాచీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
ప్రమాదానికి...
మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మంటలకు బస్సు పూర్తిగా కాలిపోయింది. మృతదేహాలు కూడా గుర్తుపట్టలేకుండా తయారయ్యాయి. అయితే బస్సు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండానే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి
Next Story

