Sat Oct 12 2024 14:51:13 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర విమాన ప్రమాదం... ఏడుగురు మృతి
పెరూలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు
పెరూలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నాజ్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. పర్యాటకులను తీసుకెళుతున్న ఈ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పైలెట్, కో పైలట్ కూడా మరణించారు. ఈ విమానం ఏరో శాంటాస్ పర్యాటక సంస్థ కు చెందిందిగా అధికారులు చెప్పారు.
దర్యాప్తునకు ఆదేశం...
విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. తేలికపాటి విమానం ప్రమాదానికి గురైన కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో విమాన ప్రమాదం జరగడం విషాదాన్ని మిగిల్చింది.
- Tags
- plane crash
- peru
Next Story