Thu Jan 29 2026 10:06:22 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు చోటు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రజలు, సైనికులు మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రజలు, సైనికులు మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. వారు మానసిక సంఘర్షణ నుండి బయట పడడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రామా రిలీఫ్, ధ్యానం,శ్వాసాభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు, ఆశ్రయం కూలిపోయిన వారికి, పిల్లలకు కొత్త ఆశను అందిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనిక నాయకత్వం గురుదేవ్ పనిని అధికారికంగా గుర్తించింది. బెటాలియన్ కమాండర్ స్వయంగా గురుదేవ్కు గౌరవ పురస్కారం అందజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల తర్వాత తమ జీవితాలు మారాయని, గాయాలతో ఉన్నవారే ఇప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.
Next Story

