Thu Mar 19 2026 22:43:11 GMT+0530 (India Standard Time)
టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం... 19 మంది మృతి
టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు.

టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా ఈ విమానం విక్టోరియా సరసులో కూలిపోయింది. పైలట్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు.
వాతావరణం....
ఈ విమానం దార్ ఎన్ సలామ్ నుంచి బుకోమా మీదుగా మంవాజా మీదుా వెళుతుంది. అయితే కూలిపోవడంతో 19 మంది మరణించగా దాదాపు 26 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 43 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story

