Thu Mar 19 2026 04:12:45 GMT+0530 (India Standard Time)
గాజాలో వైమానిక దాడి ..94 మంది మృతి
సెంట్రల్ గాజాలోని సుస్రత్ శరణార్థి శిబిరంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరపడంతో 94 మంది మరణించారు

ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 94 మంది పాలస్తీనియన్లు మరణించారు. సెంట్రల్ గాజాలోని సుస్రత్ శరణార్థి శిబిరంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. ఈ వైమానిక దాడుల్లో 94 మంది అక్కడికక్కడే మరణించగా దాదాపు రెండు వందలకు మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అల్ అక్సా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య...
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆసుపత్రికి ఇంకా గాయపడిన వారు వస్తూనే ఉండటంతో వారికి వైద్య సేవలందించేందుకు ఇతర సంస్థల సాయాన్ని అర్థించారు. ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయి ఉందని తెలిపారు. శరణార్థులు ఉన్న చోట వైమానిక దాడులు చేసి ఇంత భారీ స్థాయిలో మరణాలకు కారణం అవ్వడంతో అంతర్జాతీయంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
Next Story

