Thu Sep 12 2024 12:22:55 GMT+0000 (Coordinated Universal Time)
3,197 కోట్ల లాటరీ విన్నర్ .. లక్కీ ఫెలో ఎవరంటే?
లాటరీలో 3,197 కోట్ల రూపాయలను ఆ లాటరీ టిక్కెట్ ను కొనుగోలు చేసిన వారు గెలుచుకున్నారు.
ఎవరో ఆ అదృష్టవంతుడు. లాస్ ఏంజెల్స్ లోని వుడ్ లాడ్ హిల్స్ సెక్షన్ వద్ద ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ లో ఈ లాటరీ టిక్కెట్ అమ్ముడు పోయింది. విజేతలు ఎవరో తెలియదు. కానీ ఈ లాటరీలో 3,197 కోట్ల రూపాయలను ఆ లాటరీ టిక్కెట్ ను కొనుగోలు చేసిన వారు గెలుచుకున్నారు.
మెగా లాటరీలో... బంపర్ ప్రైజ్....
కాలిఫోర్నియాలో అతి పెద్ద లాటరీ మెగా మిలియన్స్ జాక్ పాట్ ప్రైజ్. లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు. 426 మిలియన్ డాలర్ల లాటరీ ఒకరికి వచ్చింది. మన నగదులో 3,197 కోట్ల రూపాయలు. అయితే ఈ లాటరీ టిక్కెట్ తెచ్చి ఇచ్చిన వారికి ఈ నగదును అందచేస్తారు. ఇందుకోసం ఏడాది సమయం ఉంటుంది. ఆ అదృష్టవంతుడెవరో తెలియాల్సి ఉంది.
Next Story