Sun Sep 24 2023 10:28:18 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు

కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా.. తీవ్రమైన పొగమంచు కారణంగా మూలమలుపు వద్ద డ్రైవర్ బస్సుపై పట్టుకోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రేవు పట్టణమైన ముమాకో నుంచి వెళ్తున్న సమయంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Next Story