Fri May 17 2024 01:00:39 GMT+0000 (Coordinated Universal Time)
మెక్సికిలో దారుణం... 19 మంది మృతి
మిచోవాకాన్ రాష్ట్రంలో ఒక ఫంక్షన్ ను టార్గెట్ గా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.
మెక్సికో నగరంలో విషాదం చోటు చేసుకుంది. మిచోవాకాన్ రాష్ట్రంలో ఒక ఫంక్షన్ ను టార్గెట్ గా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఫంక్షన్ జరుగుతుండగా....
సెంట్రల్ మెక్సికోలో ఒక ఫంక్షన్ జరుగుతుండగా దుండగులు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు ప్రాణాలను వదిలారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. దాడులు ఎవరు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
- Tags
- michovacan
- firing
Next Story