Fri Dec 05 2025 08:09:59 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : హాంకాంగ్ లో ఘోర విమాన ప్రమాదం
హాంకాంగ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.

హాంకాంగ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో కార్గో విమానం రన్‌వే దాటి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్‌లైన్స్ నడిపిన బోయింగ్ 747 కార్గో విమానం దుబాయ్ నుంచి హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో రన్‌వేను దాటి సముద్రంలోకి వెళ్లింది.
ఇద్దరు మృతి...
ఆ విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నుంచి లీజ్‌పై తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఇద్దరిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విమానాశ్రయంలో నేలమీద ఉన్న వాహనంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ బోయింగ్ 747 ఫ్రెయిటర్ విమానం తమది కాదని, ఏసీటీ ఎయిర్‌లైన్స్ “వెట్ లీజ్” కింద నడుపుతోందని ఎమిరేట్స్ సంస్థ మాత్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story

