Fri Mar 20 2026 11:56:46 GMT+0530 (India Standard Time)
Dubai : ఖాళీ అయిన దుబాయ్ నగరం
దుబాయ్ మహా నగరాన్ని ఇరాన్ యుద్ధం కళా విహీనమయింది.

దుబాయ్ మహా నగరాన్ని ఇరాన్ యుద్ధం కళా విహీనమయింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం దుబాయ్ పై ప్రబావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం గా ఉన్న దుబాయ్ నేడు భయంతో బితుకు బితుకుమంటుంది. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీకగా ఉండేది.
కళావిహీనంగా మారి...
విమానయాన రంగానికి కీలక స్థానంగా ఉండేది. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో నిత్యం దుబాయ్ నగరం కళకళలాడుతూ ఉండేది. పశ్చిమాసియాలో యుద్ధం దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలను మూసేశారు. రోడ్లపై జనసంచారం లేదు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బీచ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురి కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చాలా మంది దేశం విడిచి ఇప్పటికే వెళ్లిపోయారు.
Next Story

