Tue Oct 03 2023 08:34:56 GMT+0000 (Coordinated Universal Time)
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం
రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం

స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు.
ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
Next Story