Wed Jan 21 2026 05:41:48 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో జగన్ దంపతులు
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్ కు జగన్ దంపతులు హాజరయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు హైదరాబాద్ కు వచ్చారు. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరుగుతున్న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్ఛితార్థ రిసెప్షన్ కు హాజరయ్యారు. జగన్ దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలసి ఫొటో దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు.
వధూవరులను ఆశీర్వదించి...
వచ్చే నెల 17వ తేదీన వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డికి, ప్రియ అట్లూరితో వివాహం నిశ్చయమైంది. ఈరోజు నిశ్చితార్ధం జరిగింది. ఈవేడుకలకు ఏపీ తెలంగాణ నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ జగన్ బయలుదేరి వెళ్లారు.
Next Story

