Fri Dec 05 2025 19:34:04 GMT+0000 (Coordinated Universal Time)
షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
హైదరాబాద్ లోని నాగోల్ లో ఒక యువకుడు షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు

ఇటీవల చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కరోనా వైరస్ తర్వాత ఇటువంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. గుండెపోటు రావడానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని కొందరు, కాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండిస్తుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా గుండెపోటు మరణానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు.
నాగోల్ షటిల్ కోర్టులో...
తాజాగా హైదరాబాద్ లోని నాగోల్ లో ఒక యువకుడు షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నాగోల్ లో ఒక షటిల్ కోర్టులో ఆట ఆడుతుండగా గుండ్ల రాకేశ్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని సహచర ఆటగాళ్లు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ అని చెబుతున్నారు.
Next Story

