Tue Mar 17 2026 23:35:22 GMT+0530 (India Standard Time)
హర్షసాయి రెస్పాండ్ అయ్యారు.. కేసు నమోదయిన తొలిసారి
యూ ట్యూబర్ హర్షసాయి తనపై కేసు నమోదయిన తర్వాత తొలిసారి స్పందించారు. ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.

యూ ట్యూబర్ హర్షసాయి తనపై కేసు నమోదయిన తర్వాత తొలిసారి స్పందించారు. ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ హర్షసాయి అన్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, తన గురించి అందరికీ తెలుసునని, త్వరలోనే వాస్తవం బయటకు వస్తుందని హర్షసాయి తెలిపారు.
అదంతా అబద్ధమంటూ...
యూట్యూబర్ హర్షసాయి తనపై అత్యాచారం చేయడమే కాకుండా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, తన నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారని బిగ్ బాస్ షో కంటెస్ట్ ఒకరు నార్సింగి పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే హర్షసాయి తండ్రి మీద కూడా ఫిర్యాదు రావడంతో ఆ కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లింది. హర్ష సాయి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హర్షసాయి ముంబయిలో ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో హర్షసాయి ఇన్స్టాలో స్పందించారు.
Next Story

