Wed Mar 11 2026 09:56:03 GMT+0530 (India Standard Time)
మోమోస్ తిని మహిళ మృతి కేసులో జరిగింది ఇది.
హైదరాబాద్ లో మోమోస్ తిని ఒక మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది

హైదరాబాద్ లో మోమోస్ తిని ఒక మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దాదాపు ఇరవై మంది వరకూ చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం మోమోస్ తిని ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చింతలబస్తీలో మోమోస్ ను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు.
తయారు చేసిన సంస్థతో...
మోమోస్ ను తయారు చేసిన, విక్రయించిన సంస్థను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోమోస్ తిని సింగాడికుంటలో మహిళ మృతి చెందడంతో ప్రభుత్వం ఈ మేరకు అధికారులను ఆదేశించింది.
Next Story

