Fri Dec 05 2025 22:32:55 GMT+0000 (Coordinated Universal Time)
Wine Shops Closed మందు బాబులు.. ఆ రెండు రోజులు మద్యం దొరకదు
వినాయకుడి శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో

వినాయకుడి శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబరు 17వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి సెప్టెంబరు 18 సాయంత్రం 6.00 గంటల వరకు మద్యం దుకాణాలు, వైన్/టాడీ షాపులు, బార్లు మూసివేయనున్నారు. జంట నగరాల్లోని రెస్టారెంట్లకు (స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లు) కు మినహాయింపు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ను ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని ఎల్‌అండ్‌ఓ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లకు అధికారం ఉందని ప్రభుత్వ ఉత్తర్వులు తెలిపాయి.
విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఉత్సవాలకు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా, నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ జోన్‌ను సందర్శించారు. ఇలాంటి సందర్భాల్లో మతపరమైన అంశాలపై నిఘా ఉంచాలని, మత సామరస్యానికి భంగం కలిగించే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ఊరేగింపు వాహనాల విగ్రహాల ఎత్తు, యాక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, రాబోయే ఈవెంట్లకు అవసరమైన ఇతర కార్యాచరణ అంశాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. రద్దీని తగ్గించి ఊరేగింపులు సజావుగా సాగేలా చూడాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.
Next Story

