Fri Dec 05 2025 23:11:38 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాదీలకు అలర్ట్... రాత్రికి మళ్లీ వర్షం పడే ఛాన్స్
హైదరాబాద్ లో ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశముందని వాతవరణ వాఖ తెలిపింది

హైదరాబాద్ లో ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశముందని వాతవరణ వాఖ తెలిపింది. రాత్రి ఎనిమిది గంటలలోపు వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈరోజు కూడా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలపడంతో హైదరాబాద్ వాసులకు అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంతో పాటు మెదక్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
పిడుగులు పడే అవకాశం...
ఈ సమయంలో పిడుగులు పడే అవకాశమున్నందున రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండవద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. నిన్న రాత్రి కుండపోత కురిసిన వర్షానికి రోడ్లంతా జలమయియి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. నాలాలన్నీ పొంగాయి. ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. దీంతో ఈరోజు విధులకు వెళ్లిన వారు వీలయినంత త్వరగా తమ ఇళ్లకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Next Story

