Fri Dec 05 2025 07:19:14 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రేవంత్ గెటప్ లో వినాయకుడు.. చివరికి?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో వినాయకుడి విగ్రహం పెట్టడం వివాదాస్పదమైంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో వినాయకుడి విగ్రహం పెట్టడం వివాదాస్పదమైంది. గోషామహల్ నియోజకవర్గం అఘాపురాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా విగ్రహం పెట్టారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహం పెట్టిన మండపాన్ని సౌత్ వెస్ట్ డీసీపీ సందర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, విగ్రహం తీసేయాలని ఆదేశించారు. పోలీసులు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
Next Story

