Sun Mar 15 2026 02:58:50 GMT+0530 (India Standard Time)
Breaking : వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న అధికారులు
విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు

విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయానికి చేరుకున్నారు. అయితే దుబాయ్ ప్రయాణానికి ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించలేదు. ఆయనపై లుకౌట్ నోటీసులున్నందున ప్రయాణానికి అనుమతించబోమని తెలిపారు.
టీడీపీ కార్యాలయంపై...
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కు ఈ లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. అవినాష్ ఎక్కడకు విదేశాలకు వెళ్లిపోకుండా ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయన దుబాయ్ ప్రయాణం నిలిచిపోయింది
Next Story

