Thu Dec 18 2025 10:05:56 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి
ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు

ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు. రెండు రోజుల పాటు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదసస్సులో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే మరికొన్ని ప్రయివేటు కార్యక్రమాల్లోనూ రాధాకృష్ణన్ పాల్గొంటారు.
రెండు రోజుల పాటు...
ఈ నెల 21న కన్హా శాంతివనంలో ధ్యాన దినోత్సవానికి హాజరుకానున్నారు. ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. ఉప రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అలాగే పోలీసులు కూడా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

