వర్స్ ఇన్నోవేషన్ బోర్డులో పి.ఆర్. రమేష్ నియామకం ఆడిట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగింత
పాలన బలోపేతంపై దృష్టి తదుపరి వృద్ధి దశకు సంస్థ సిద్ధం

హైదరాబాద్ :భారతదేశంలో స్థానిక భాషల ఆధారిత కృత్రిమ మేధా సాంకేతిక వేదికగా నిలిచిన వర్స్ ఇన్నోవేషన్ సంస్థ తన బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పి.ఆర్. రమేష్‌ను నియమించింది. ఆయనకు ఆడిట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించింది. సంస్థ తదుపరి వ్యూహాత్మక వృద్ధి దశలో పాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రమేష్ ఇప్పటికే ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, లార్సెన్ అండ్ టుబ్రో, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐటీసీ హోటల్స్, సియెంట్, తేజాస్ నెట్వర్క్స్, హెచ్డీఎఫ్సీ వంటి పలు ప్రముఖ సంస్థల బోర్డుల్లో పనిచేశారు లేదా ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2022-23 సంవత్సరానికి ‘బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్’ అవార్డును ఆసియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ నుంచి అందుకున్నారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ వంటి సంస్థల కమిటీలు, సలహా మండళ్లలో కూడా ఆయన పనిచేసి పాలన, ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో భాగమయ్యారు.
వర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బెడి మాట్లాడుతూ, “దీర్ఘకాలంగా నిలిచే సంస్థ నిర్మాణానికి బలమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. పి.ఆర్. రమేష్‌కు బోర్డు నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలు, అంతర్జాతీయ ఆడిట్ అనుభవం విస్తృతంగా ఉంది. సంస్థ స్థిరమైన వృద్ధిపై దృష్టి పెడుతున్న ఈ దశలో ఆయన మార్గదర్శకత్వం కీలకం అవుతుంది” అన్నారు.
పి.ఆర్. రమేష్ మాట్లాడుతూ, “భారత డిజిటల్ రంగంలో వర్స్ ఇన్నోవేషన్ ఇప్పటికే పెద్ద స్థాయికి చేరింది. ఆ స్థాయికి తగ్గట్టుగా పాలన వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణలు, రిస్క్ పర్యవేక్షణ కూడా బలోపేతం కావాలి. ఆవిష్కరణతో పాటు క్రమశిక్షణ, బాధ్యత కూడా సంస్థలకు అవసరం. బోర్డు, యాజమాన్యంతో కలిసి ఈ అంశాలను మరింత పటిష్టం చేయడానికి పనిచేస్తాను” అన్నారు.
ఆడిట్ కమిటీ చైర్మన్‌గా ఆయన ఆర్థిక నివేదికల పారదర్శకత, అంతర్గత నియంత్రణలు, రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణ అనుసరణ, ఆడిట్ ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. ఈ నియామకం సంస్థ పాలన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వర్స్ తెలిపింది.
వర్స్ ఇన్నోవేషన్ ప్రారంభం నుంచే సాంకేతికతతో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. కృత్రిమ మేధా, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలతో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ అందిస్తోంది. డైలీహంట్, జోష్ వంటి యాప్‌ల ద్వారా కోట్లాది వినియోగదారులకు స్థానిక భాషల్లో సేవలు అందిస్తోంది. నెక్స్‌వర్స్.ఏఐ, డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో సేవలు వంటి ఉత్పత్తులతో డిజిటల్ రంగంలో విస్తరణ కొనసాగిస్తోంది.

