వనస్థలిపురం TO పెద్ద అంబర్‌పేట.. ఇక డబుల్ డెక్కర్ రోడ్డు
హైదరాబాద్‌లో ఎల్బీనగర్ చింతలకుంట నుంచి పెద్దఅంబర్‌పేట రేడియోస్టేషన్ వరకు డబుల్‌డెక్కర్ రోడ్డు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో ఎల్బీనగర్ చింతలకుంట నుంచి పెద్దఅంబర్‌పేట రేడియోస్టేషన్ వరకు డబుల్‌డెక్కర్ రోడ్డు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వనస్థలిపురం కూడలి వద్ద ఎక్స్‌ప్రెస్ వే పనులను మంత్రి పరిశీలించారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 650 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను చేపట్టామని, త్వరలోనే ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబోతున్నామన్నారు. స్థానికుల భద్రత కోసం ఇదే ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కింద వాహనాలు, పైన మెట్రోరైలు వెళ్లేలా రోడ్డు నిర్మించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రతిపాదనతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తానన్నారు వెంకట్‌రెడ్డి.

