Tue Jan 20 2026 06:57:45 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యలక్ష్మి ఆలయంలో యోగి
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ దర్శించుకున్నారు

చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగి ఆదిత్యానాధ్ కు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆదిత్యానాధ్ వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లు ఉన్నారు.
పటిష్ట భద్రత...
యోగి ఆదిత్యానాధ్ పాతబస్తీకి వస్తుండటంతో పెద్దయెత్తున పోలీసులు భధ్రతను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ 500 మీటర్ల మేర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశఆరు. రూఫ్ టాప్ భద్రతను కూడా ఏర్పరిచారు. మొత్తం 350 మంది తో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యానాధ్ పూజలు నిర్వహించి వెళ్లి పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యోగి ఆలయంలో ఉన్నంతసేపు భక్తులు ఎవరినీ అనుమతించలేదు.
Next Story

