Sun Aug 07 2022 19:53:03 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యలక్ష్మి టెంపుల్ కు యోగి

ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ వచ్చే నెల 2వ తేదీన ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి రానున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన సమావేశాలకు హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 2వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరుకానున్నారు.
హై సెక్యూరిటీ...
ఆయన నేరుగా భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తారని బీజేపీ వర్గాలు చెప్పాయి. భాగ్యలక్ష్మి ఆలయానికి రావాల్సిందిగా యోగి ఆదిత్యానాధ్ ను బీజేపీ నేతలు కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలిసింది. ఆయన ఇక్కడకు వస్తుండటంతో పెద్ద యెత్తున పోలీసులు మొహరించనున్నారు. ఇప్పటికే పాతబస్తీలో నుపుర్ శర్మ కామెంట్స్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాధ్ పర్యటనలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేయనునున్నారు.
Next Story