Thu Mar 05 2026 11:15:42 GMT+0530 (India Standard Time)
Kishan Reddy : నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన
నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన సాగనుంది

నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన సాగనుంది. ఉదయం పది గంటలకు బన్సీలాల్పేట డివిజన్లో కిషన్ రెడ్డి పర్యటిస్తారు. కిషన్ రెడ్డి బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇవ్వనున్నారు. బన్సీలాల్ పేటలో తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ కు...
కిషన్ రెడ్డి బన్సీలాల్ పర్యటన ముగించుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్ కు వెళతారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో బీజేపీ స్థానిక నేతలు కూడా పాల్గొననున్నారు.
Next Story

