Fri Dec 05 2025 14:00:49 GMT+0000 (Coordinated Universal Time)
అర్థరాత్రి నలుగురి హత్య.. ఈ నగరానికి ఏమైంది ?
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై జంట హత్యలు కలకలం రేపాయి. మైలార్ దేవుపల్లి..

భాగ్యనగరంలో మళ్లీ నేరాలసంఖ్య పెరుగుతోంది. వరుస దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్ లతో నగరవాసులను దుండగులు హడలెత్తిస్తున్నారు. తాజాగా ఒకేరోజు అర్థరాత్రి సమయంలో నలుగురి హత్య.. ఉలిక్కిపడేలా చేసింది. పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్న హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు గత అర్థరాత్రి దారుణ హత్యలకు గురయ్యారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో ఇద్దరిని దుండగులు హతమార్చారు.
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై జంట హత్యలు కలకలం రేపాయి. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ హత్యలు జరిగాయి. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గ్రానైట్ రాళ్లతో కొట్టి.. హతమార్చారు. టప్పాచబుత్రలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్ అలియాస్ సోఫియా లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి హతమార్చారు. ఈ నాలుగు హత్యలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

