Fri Dec 05 2025 14:50:09 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగంలో చేరి రెండు రోజులు.. భీమ్ రావు పరిస్థితి ఎలా ఉందంటే!!
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో కొందరు కార్మికుల కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో కొందరు కార్మికుల కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరినడగాలో తెలియక తమవారి ఫొటోలు పట్టుకుని ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన భీమ్రావు తన భార్య సోనీతో కలిసి బండ్లగూడలో ఉంటున్నాడు. రెండురోజుల క్రితమే కంపెనీలో చేరాడు. సోమవారం ఉదయం 8 గంటలకు పనికి వెళ్లగా ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. సోని కుటుంబసభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లింది. భర్త ఆచూకీ కోసం ప్రయత్నించగా పటాన్చెరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా భీమ్రావు తీవ్రంగా కాలిన గాయాలతో కనిపించాడు. సోని బోరున విలపిస్తూ.. తన భర్తకు మంచి వైద్యం అందించాలని కోరుతోంది.
Next Story

