Thu Apr 02 2026 10:05:51 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్లో కొత్త పోలీస్స్టేషన్లు ఇవే
హైదరాబాద్ కొత్త కమిషనరేట్ పరిధిలో ఇరవై కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్ కొత్త కమిషనరేట్ పరిధిలో ఇరవై కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బండ్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలిచౌకి-గుడిమల్కాపూర్. మసాబ్ ట్యాంక్ పోలీసు స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేశారు.
మహిళా పోలీస్ స్టేషన్లు...
వీటితో పాటు ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలోనూ కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు జోన్లలో ఒక్కొక్క జోన్ కు ఒక మహిళ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త పోలీస్ స్టేషన్లకు త్వరలో ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని నియమించనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ లో మరో పదమూడు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
Next Story

