Fri Dec 05 2025 22:07:21 GMT+0000 (Coordinated Universal Time)
ఎర్రగడ్డలో ట్రావెల్స్ బస్సు బీభత్సం..
ఎర్రగడ్డ నుంచి ఈఎస్ఐ వైపుకు వెళ్తోంది. ఈ క్రమంలో రైతు బజార్ సిగ్నల్ వద్ద ధనుంజయ ట్రావెల్స్..

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. స్థానిక రైతు మార్కెట్ సిగ్నల్ వద్ద బస్సు అదుపుతప్పి రెండు కార్లతో పాటు.. పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసమవ్వగా.. నలుగురు గాయపడ్డారు. బస్సు అదుపుతప్పడంతో.. అక్కడున్నవారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. ఘటనపై ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎర్రగడ్డ నుంచి ఈఎస్ఐ వైపుకు వెళ్తోంది. ఈ క్రమంలో రైతు బజార్ సిగ్నల్ వద్ద ధనుంజయ ట్రావెల్స్ అదుపుతప్పింది. రెడ్ సిగ్నల్ పడటంతో కార్లు, మరికొన్ని ద్విచక్రవాహనాలు ఆగి ఉండగా.. వాటిమీదికి దూసుకెళ్లింది. సెయింట్ థెరిసా ఆసుపత్రి ముందున్న ట్రాఫిక్ బూత్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమవ్వగా.. నలుగురు గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎస్సార్ నగర్ పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

